: కేన్సర్ బారిన పడిన చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం నింపిన సన్ రైజర్స్ టీం
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేన్సర్ బారిన పడిన చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం నింపింది. హైదరాబాదులోని అపోలో కేన్సర్ ఆసుపత్రిని సందర్శించిన క్రికెటర్లు, కేన్సర్ తో బాధపడుతున్న చిన్నారులతో గల్లీ క్రికెట్ ఆడి వారితో ఆనందం పంచుకున్నారు. శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మ, డారెన్ స్యామీ, భువనేశ్వర్ కుమార్ తదితరులు చిన్నారుల్లో విశ్వాసం నింపారు.