: రాత్రి 11 వరకు లెక్కింపు జరుగుతుంది: రమాకాంత్ రెడ్డి
రాత్రి 11 గంటల వరకు ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి రమాకాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాత్రి 11 గంటలకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సులో ఉన్న ఓట్లను వేరు చేయడం, పార్టీల వారీగా కట్టలు కట్టడం ఈ ఉదయం జరిగిందని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాలో తడిసిన, చెదలు పట్టిన మూడు ఎంపీటీసీ స్థానాలకు తిరిగి ఎన్నికల నిర్వహిస్తామని ఆయన తెలిపారు.