: పంజాగుట్టలో సన్ రైజర్స్ సందడి
సన్ రైజర్స్ జట్టు సభ్యులు హైదరాబాద్ పంజాగుట్టలోని మాన్యవర్ బట్టల దుకాణంలో సందడి చేశారు. ప్రాక్టీస్, పెర్ఫార్మెన్స్ తో నిత్యం బిజీగా గడిపే ఆటగాళ్లు ఆటవిడుపుగా మాన్యవర్ లో షాపింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్, కరణ్ శర్మ, రాహుల్, నమన్ ఓజా, పర్వేజ్ రసూల్ తదితరులు దుకాణం మొత్తం కలియదిరిగారు. సన్ రైజర్స్ జట్టుకు మాన్యవర్ కో బ్రాండ్ గా వ్యవహరిస్తుండడంతో ఆటగాళ్లు షాపింగ్ కు వచ్చారు.