: 'ముల్ల పెరియార్ డ్యామ్' తీర్పుపై కేరళ రివ్యూ పిటిషన్!


సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న 'ముల్ల పెరియార్ డ్యామ్' వివాదంలో తమిళనాడుకు ఊరట కలిగే విధంగా 135 అడుగులు ఉన్న డ్యామ్ నీటి మట్టాన్ని 145 అడుగులు పెంచుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో, కేరళ ప్రభుత్వం తీవ్ర నిరాశకు లోనైంది. మళ్లీ సుప్రీంలోనే కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ త్వరలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న (సోమవారం) ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చాందీ తెలిపారు. తమిళనాడుకు నీరు ఇచ్చేందుకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని... కానీ, అదే సమయంలో కేరళ భద్రత కూడా చూసుకోవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News