: స్కూల్లోకి చొరబడి ఇద్దరు టీచర్లని కాల్చేశారు
పాకిస్థాన్లో తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రాంతంలోని హంగు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మరణించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.