: ఆ కుటుంబం నుంచి పోటీ చేసిన ఏడుగురూ ఓడిపోయారు
ఒకే కుటుంబం నుంచి ఏడుగురు పోటీ చేశారు, అయితే వారందరూ ఓటమి పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీకి సంబంధించి పలు వార్డుల నుంచి వీరు పోటీ చేసి ఓడిపోయారు. వీరిలో ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు. ఇబ్రహీంపట్నంలోని ఆంగ్లిస్ట్ స్కూల్ యజమాని చెన్నయ్య కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు పలు వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీచేశారు.
ఇబ్రహీంపట్నం ఒకటో వార్డు నుంచి చెన్నయ్య కుమారుడు భానుబాబు, 4, 13 వార్డుల నుంచి కూతుళ్లు భానురేఖ, భానుప్రియ, 15వ వార్డు నుంచి భార్య ఆండాళ్, 20వ వార్డు నుంచి అల్లుడు పల్లె శ్రీధర్ బాబు, 9 వార్డు నుంచి కోడలు జయ, 16వ వార్డు నుంచి కుమారుడు భానుచందర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.