: ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ బోణీ
పరిషత్ ఎన్నిల ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ తన ఖాతా తెరిచింది. ఇక్కడి ఇచ్చోడ మండలం ఈద్గాంలో కమలం ఎంపీటీసీ స్థానాన్ని గెలుపొందింది. ఇప్పటికే ఈ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ లు తలొకటి బోణీ కొట్టాయి. ఇక అటు రంగారెడ్డి జిల్లాలోనూ బీజేపీ తన ఖాతా తెరిచింది. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి-3 ఎంపీటీసీ స్థానంలో విజయం సాధించింది. ఇక దుండిగల్-4 ఎంపీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.