: భారత్ లో తదుపరి ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం: ఒబామా
మోడీ సారధ్యంలో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. భారత్ లో ఏర్పడే తదుపరి ప్రభుత్వంతో కలసి పని చేయాలని అనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. జాతీయ ఎన్నికలను పూర్తి చేసుకున్న భారత ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ఒబామా నిన్న ఒక ప్రకటన జారీ చేశారు. చరిత్రలో అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను నిర్వహించి భారత్ రికార్డు నమోదు చేసిందన్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇరు దేశాలు బలమైన స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాయని, ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంతోనూ సన్నిహితంగా కలసి పనిచేస్తామన్నారు.