: 'పదార్థం' రూపంలో అత్యంత తేలికైంది ఇదే
మామూలుగా గాలి అన్నిటికంటె తేలికైంది అనుకుంటాం. కానీ గాలిలో కూడా రకాలుంటాయి. గాలికి బరువుంటుంది గనుకనే బెలూన్‌లో గాలి నింపినప్పుడు అది కింద పడిపోతుంది. అదే గాలిలో హీలియం అత్యంత తేలికైంది గనుక.. హీలియం నింపిన బెలూన్లు పైకే ఎగురుతుంటాయి తప్ప కింద పడవు.
గాలి సంగతి వదిలేస్తే .. పదార్థం రూపంలో ఉన్న ప్రతిదానికీ ఒక బరువు ఉంటుంది. అయితే అత్యంత తేలికైన ‘పదార్థాన్ని’ ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఈ రకమైన ప్రయోగాల్లో ఈ ఆవిష్కరణ ద్వారా వారు జర్మనీ పరిశోధనను అధిగమించారు. తాజాగా చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కార్బన్ ఎయిరోజెల్ అనే పదార్థాన్ని రూపొందించారు. దీని సాంద్రత 0.16 ఎంజీ/ ఘనపు సెం.మీ. మాత్రమే. ఏడాది కిందట జర్మనీ శాస్త్రవేత్తలు ప్రపంచంలో అత్యంత తేలికైన పదార్థం పేరిట 0.18 ఎంజీ/ఘనపు సెం.మీ. తో గ్రాఫైట్ ఎయిరోజెల్‌ను తయారుచేశారు. ప్రస్తుత చైనా ఆవిష్కరణ ఆ జర్మనీ రికార్డును బద్దలు కొట్టింది.