: ప్రియురాలి కోసం ఖర్చు పెట్టిన డబ్బును ఇప్పించండి మహాప్రభో!


ప్రేమించినంత కాలం తన ప్రియురాలి కోసం ఖర్చు చేసిన డబ్బును ఇప్పించాలని హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. జూబ్లీహిల్స్ లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు ఆనందంగా గడిపారు. కానీ ప్రేమించిన యువతి అనివార్య కారణాలతో మరో యువకుడిని పెళ్లాడింది. దీంతో ఈ భగ్న ప్రేమికుడు నిరాశకు గురయ్యాడు.

ప్రేమించిన అమ్మాయి ఎలాగూ దక్కలేదు. ప్రేమించుకున్న రోజుల్లో ఆమెకు ఖర్చు పెట్టిందంతా తిరిగి ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఎలాగోలా సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ, ఆ ప్రేమికుడు మాత్రం ససేమిరా అంటూ, కేసు నమోదు చేయాల్సిందేనంటూ పట్టుబట్టి ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News