: వారణాసిలో రికార్డు స్థాయిలో పోలింగ్


దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారణాసి పార్లమెంటు స్థానంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో అక్కడ కేవలం 42 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా, ఈసారి మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు 45 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ సహా.. అనేక మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మారుమూల ప్రాంతాలతో పాటు రాంనగర్; నదేసర్, బేణీబాగ్, బెనారస్ హిందూ యూనివర్శిటీ క్యాంపస్ లాంటి పట్టణ ప్రాంతాల నుంచి కూడా ఓటర్లు భారీగా తరలివచ్చారు. వారణాసిలో మొత్తం 16 లక్షల మంది ఓటర్లుండగా వారిలో 3 లక్షల మంది ముస్లింలున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ అత్యుత్సాహంతో తమ పార్టీ గుర్తును తన కుర్తా మీద ధరించి ఓటు వేయడానికి వెళ్లడంతో... ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. సిగ్రా పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పోలిసులు తెలిపారు.

  • Loading...

More Telugu News