: రాజధాని నిర్మాణం...రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబు చేస్తారు: దేవినేని
ప్రజల తీర్పు తేటతెల్లమైందని టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని చేకూర్చారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతమవుతాయని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం, రాష్ట్ర పునర్నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు సమర్థవంతంగా చేయగలరని ప్రజలు విశ్వసించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చంద్రబాబు తీర్చిదిద్దగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.