: పోలింగ్ బూత్ లోని ల్యాప్ టాప్ పై ములాయం, అఖిలేష్ స్టిక్కర్!
చివరి దశ పోలింగ్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని చందౌలీ పోలింగ్ బూత్ లోని ట్యాప్ టాప్ పై సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫొటోలతో ఉన్న స్టిక్కర్ ను అంటించారు. దీనిపై చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఉమేష్ సిన్హా మాట్లాడుతూ, ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ తమకు సమాచారం అందించారని చెప్పారు. సరైన చర్య తీసుకుంటామని తెలిపారు. అటు ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేశాయి.