: విజయనగరంలో టీడీపీ పునర్వైభవం సాధించింది: అశోక్ గజపతి రాజు
విజయనగరం జిల్లాలో టీడీపీ పునర్వైభవం సాధించిందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు టీడీపీకి ఏకపక్ష విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు టీడీపీకి విజయం చేకూరుస్తూ తమకు గురుతర బాధ్యతలు అప్పగించారని ఆయన అన్నారు. రాష్ట్రానికి వనరులు, నిధులు సమకూరేలా కృషి చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇవే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతమవుతాయని ఆయన స్పష్టం చేశారు.