: ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ విద్యార్థులను తరగతుల నుంచి బహిష్కరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల బహిష్కరణను నిరసిస్తూ ఇప్లూ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థులు యూనివర్సిటీలోనికి ప్రవేశించకుండా పోలీసులు గేట్లు మూసేశారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గేట్లు, పోలీసులను తోసుకుంటూ యూనివర్సిటీలోకి ప్రవేశించేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు గేటు ముందు బైఠాయించారు.