: హైదరాబాదు శివారు ఆల్వాల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి హైదరాబాదులో అపచారం జరిగింది. నగర శివారు ఆల్వాల్, బాలాజీ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు ఈ తెల్లవారుఝామున నాలుగు గంటలకు నిప్పు పెట్టారు. విగ్రహం మీద పాత టైర్లు వేసి, పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో విగ్రహం పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలియడంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి తరలి వచ్చి, ఆందోళన చేబట్టారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా వుంది.