: మాతృదినోత్సవం నాడు ఘోరం... మురికి కాల్వలో పసికందు


మాతృదినోత్సవం నాడు కూడా ఆ మాతృమూర్తికి మనసు కరగలేదు. ఇష్టం లేకో లేక సామాజిక కట్టుబాట్ల ఒత్తిడో... అప్పుడే పుట్టిన తన కన్నబిడ్డను మురికి కాల్వలో పడేసింది. పసిబిడ్డ ఏడుపు విన్న ఇరుగు పొరుగు వారు ఆ బిడ్డను బయటకు తీశారు. ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఐసీడీఎస్ సిబ్బంది... స్థానికుల సహాయంతో పసిబిడ్డను ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన కర్నూల్ జిల్లా డోన్ లో జరిగింది.

  • Loading...

More Telugu News