: రేపటి మ్యాచ్ కు మలింగ దూరం
గాయాలతో ఐపీఎల్ మ్యాచ్ ల నుంచి తప్పుకుంటున్న వారి జాబితాలో తాజాగా శ్రీలంక పేసర్ లసిత్ మలింగ కూడా చేరాడు. ముంబయి ఇండియన్స్ కు ప్రధాన బౌలర్ అయిన మలింగ రేపు రాయల్ చాలెంజర్స్ తో జరిగే మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా ఈ యార్కర్ స్పెషలిస్ట్ గాయపడ్డాడు. ప్రస్తుతం వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న మలింగ ఇప్పుడప్పుడే బరిలో దిగి రిస్క్ తీసుకోవడమెందుకని భావిస్తున్నాడు.
కాగా, మలింగ గైర్హాజరీలో మిచెల్ జాన్సన్, మునాఫ్ పటేల్, నాథన్ కౌల్టర్-నైల్ తదితరులతో కూడిన ముంబయి బౌలింగ్ విభాగం పటిష్టమైన రాయల్ చాలెంజర్స్ కు ఎలా ముకుతాడు వేస్తుందో చూడాలి. ఎందుకంటే, ఆ జట్టులో అత్యంత ప్రమాదకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ తో పాటు విరాట్ కోహ్లీ వంటి ఉద్ధండులున్నారు. వీరందరూ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయడంలో దిట్టలే!