: మోహన్ భగవత్ తో రాజ్ నాథ్ సింగ్ భేటీ
బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో ఈ రోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. మోడీ భగవత్ ను కలసిన గంటల వ్యవధిలోనే రాజ్ నాథ్ కూడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల్లో విజయం ఖాయమని భావిస్తున్న బీజేపీ నేతలు ఫలితాల అనంతరం అనుసరించాల్సిన విధానంపై ఆర్ఎస్ఎస్ తో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.