: సహారా కేసులో జడ్జిలపై ఒత్తిడి ఉంది: జస్టిస్ రాధాకృష్ణన్


సహారా కేసు విచారణలో జడ్జిలపై ఎంతగానో ఒత్తిడి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితమే జస్టిస్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్ కు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లకు సుమారు 20వేల కోట్ల రూపాయలకు పైగా బకాయి పడిన సహారా గ్రూపు కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో జస్టిస్ రాధాకృష్ణన్ వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యం నెలకొంది. ఈ కేసులో వస్తున్న ఒత్తిడి తన కుటుంబ సభ్యులను సైతం బాధకు గురి చేసిందని, ఇంతకు మించి చెప్పలేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News