: ఆసుపత్రి బిల్లు కూడా కట్టలేని స్థితిలో 'లగాన్' నటుడు


మనిషి జీవితానికి లేశమాత్రం విలువివ్వకుండా నిర్దయ ప్రదర్శించడంలో విధి తర్వాతే ఎవరైనా. ఎంతటివారినైనా ఒకే రీతిలో పలకరించడం దీని ప్రధాన విధి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. లగాన్ చిత్రంలో నటించిన ఓ క్యారెక్టర్ నటుడు నేడు కనీసం ఆసుపత్రి బిల్లు కూడా కట్టలేని దయనీయ స్థితిలో బేల చూపులు చూస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు మందులు కూడా కొనలేక ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తే బావుండని ఎదరుచూస్తున్నారు.

ఆ నటుడి పేరు శ్రీవల్లభ్ వ్యాస్. లగాన్ తో పాటు శూల్, దిల్ బోలే హడియప్పా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. పాపం, వెండితెరపై హ్యాపీ క్యారెక్టర్లతో ప్రేక్షకులకు వినోదం పంచిన వ్యాస్ నిజ జీవితంలో మాత్రం విషాదం పండించాల్సిరావడం విచారకరం. నాలుగేళ్ళ క్రితం ఓ సినిమా సెట్స్ పై కుప్పకూలిన క్షణాలు ఆయన జీవితాన్ని అగాధాల్లోకి నడిపించాయి.  

ఓ శస్త్రచికిత్స నిర్వహిస్తే అది వికటించి శరీరం మొత్తం చచ్చుబడిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు జీవచ్ఛవంలా బతుకీడుస్తున్నాడీ బాలీవుడ్ నటుడు. ప్రస్తుతం ఆరోగ్యం విషమించడంతో జైపూర్ లోని ఓ హాస్సిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని సోదరుడు ఆర్ధికంగా కాస్తంత ఆసరాగా ఉన్నా అది ప్రస్తుత పరిస్థితుల్లో చాలడంలేదన్నది వ్యాస్ కుటుంబం మాట. 

  • Loading...

More Telugu News