: అకాల వర్షాలతో రాష్ట్రంలో పంటలకు అపార నష్టం... 9 మంది మృతి
గత మూడు రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలతో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందినట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. ప్రకాశం జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు, వరంగల్ జిల్లాలో ఒకరు మరణించారు. 9,988 హెక్టార్టలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం తెలిపింది. 35,910 హెక్టార్లలో ఉద్యాన పంటలకూ ఈ వర్షాలతో నష్టం వాటిల్లింది. కొబ్బరి, మామిడి, నిమ్మ, అరటి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది.