: వారం రోజులే గడువు...దేశం విడిచిపోండంటున్న పాకిస్థాన్


తమ దేశాన్ని విడిచిపోవాలంటూ ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు పాకిస్థాన్ అల్టిమేటం జారీ చేసింది. వీసా గడువు ముగిసినా ఐదు నెలలుగా ఉంటున్న జర్నలిస్టులపై పాకిస్థాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశానికి చెందిన 'ద హిందూ' జర్నలిస్టు మీనామీనన్, పీటీఐ జర్నలిస్టు స్నేహేష్ అలెక్స్ ఫిలిప్ 2013 ఆగస్టులో వీసాపై ఇస్లామాబాద్ వెళ్లారు. వీరు ప్రతి మూడు నెలలకు వీసా పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు.

మార్చి 9న వీరి వీసా గడువు ముగుస్తుండడంతో గడువు పెంచాలని వారు ముందుగానే దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసేంతవరకు ప్రక్రియ కొనసాగుతోందంటూ అధికారులు సమాధానమిచ్చారు. దీంతో వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. వారి లేఖకు ఏ సమాధానం చెప్పని అధికారులు, గడువు ముగియడం వల్ల వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News