: కేసీఆర్ వ్యాఖ్యలకు, వైకాపాకు సంబంధం లేదు: గట్టు
సీమాంధ్రలో జగన్ పార్టీకి 100కు పైగా సీట్లు వస్తాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఆచితూచి స్పందిస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలకు, వైకాపాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. జగన్ సీఎం కావడం తథ్యమని... దానికోసం సర్వేలు అవసరం లేదని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు తెలిపారు. కేసీఆర్, జగన్ లు భిన్న ధృవాలని... వారి మధ్య ఎలాంటి అనుబంధం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కూడా వైకాపా పోరాడుతుందని అన్నారు.