: రాజకీయాల కోసమే రాష్ట్ర విభజన: కావూరి
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ తో జతకట్టిందని బీజేపీ నేత కావూరి సాంబశివరావు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన ప్రజల కోసం కాదు, రాజకీయాల కోసమే జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బడుగు, బలహీన వర్గాలు దూరమయ్యాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రచారానికే కాని, అవి ప్రజలకు చేరలేదన్నారు. ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరిగిందని కావూరి సాంబశివరావు పేర్కొన్నారు.