: ఆర్టీసీ బస్సు తలుపు ఊడి పడి... యువకుడు మృతి
రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు తలుపు ఊడిపోవటంతో ఓ యువకుడు జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మేడిపల్లిలో ఇవాళ మధ్యాహ్నం జరిగింది. దీంతో అస్తవ్యస్తంగా ఉన్న బస్సు నిర్వహణపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు.