: చిలకలూరిపేటలో మైనర్ పై అత్యాచారం
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. వడ్డెర కాలనీలో మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. బాలిక తన తల్లిదండ్రులకు విషయం వివరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, బాలిక నుంచి అత్యాచారం చేసిన యువకుడి వివరాలు సేకరించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.