: ఎన్ఐటీల్లో ఫీజు పెరుగుతోంది!
ఎన్ఐటీలో ఫీజును సంవత్సరానికి 70 వేలుగా నిర్ణయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు ప్రభుత్వం నుంచి ట్యూషన్ ఫీజుల పెంపునకు సంబంధించి ఉత్తర్వులు అందుకున్నాయి. దీంతో 2014-15 విద్యా సంవత్సరానికి అన్ని ఎన్ఐటీల్లో బీటెక్, ఎంసీఏ, ఎం.టెక్ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులు పెంచిన ఫీజు చెల్లించక తప్పదు. దీంతో పాటు రెండు సంవత్సరాల ఎమ్మెస్సీ కోర్సుకు కూడా ఫీజును ఏడాదికి రూ. 15 వేలు పెంచాలని ఎన్ఐటీ మండలి ప్రభుత్వాన్ని కోరింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం ఈ ఫీజు పెంపు వర్తించదు.