: శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానంలో హైదరాబాదు వచ్చిన ఓ మహిళ లగేజ్ తనిఖీ చేసిన సమయంలో బంగారం బయటపడింది. అనంతరం ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.