: వేధింపుల కేసులో ఎంపి రాజయ్యకు బెయిల్
కోడలు సారికపై వేధింపుల కేసులో వరంగల్ ఎంపీ రాజయ్య, ఆయన భార్యకు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. తనను భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కొన్ని రోజుల కిందట రాజయ్య కోడలు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో, వెంటనే వారు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, రాజయ్య కుమారుడు అనిల్ కుమార్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.