: మాక్స్ వెల్ వర్సెస్ గేల్... సునామీ ఎవరిది?


ఐపీఎల్-7 లో నేటి సాయంత్రం కింగ్స్ లెవన్ పంజాబ్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ ఉత్కంఠను పెంచుతోంది. రెండు దిగ్గజ జట్ల మధ్య పోటీని విశేషంగా పేర్కొనే క్రికెట్ లో, సచిన్ నిష్క్రమణ తరువాత తొలిసారి ఇద్దరు బ్యాట్స్ మన్ సమరంగా ఈ మ్యాచ్ ను విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయగల క్రిస్ గేల్, గ్లెన్ మాక్స్ వెల్ లు ఎదురెదురుగా తలపడనున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ లో తుపాను వేగంతో బంతిని బౌండరీలు దాటించి గేల్ తన సత్తా చాటుకున్నాడు. మాక్స్ వెల్ ఐపీఎల్ లో వరుస మ్యాచ్ లలో నిలకడగా సునామీలా విరుచుకుపడి తానెంత ప్రమాదమో హెచ్చరికలు పంపించాడు. దీంతో ఈ మ్యాచ్ ను వీరిద్దరి మధ్య పోరాటంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఇద్దరూ చెలరేగితే ఇక మ్యాచ్ అభిమానులకు మంచి బిర్యానీ విందే. ఇద్దర్లో ఎవరు అభిమానులను ఆకట్టుకుంటారో చూడాలి!

  • Loading...

More Telugu News