: ఖమ్మం జిల్లాలో బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్స్ కంపెనీ
ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో మైత్రీ చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎలాగైనా నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ఖాతాదారుల నుంచి ఎంత మేరకు వసూలు చేసిందన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.