: విమానంలో రెండు కేజీల బంగారం స్వాధీనం
కేరళలోని కారిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. షార్జా, కాలికట్ విమానం ల్యాండ్ అవడానికి కొద్ది నిమిషాల ముందు టాయిలెట్ లో దాచి ఉంచిన బంగారాన్ని గుర్తించిన ఎయిర్ హోస్టెస్, పైలట్ కు తెలిపారు. పైలట్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 60 లక్షల రూపాయలు ఉంటుందని, అక్రమంగా తరలించే ప్రయత్నంలో ఈ బంగారాన్ని టాయిలెట్ లో దాచి ఉంచారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వారు తెలిపారు.