: ఆగ్రహంతో జడ్జిపైకి సెల్ ఫోన్ విసిరిన మహిళ


రీటా సింగ్ అనే మహిళ జడ్జిపైకి సెల్ ఫోన్ విసిరి సంచలనం సృష్టించింది. శరణ్ జిల్లా సోనిపూర్ కు చెందిన రీటా సింగ్ తన బంధువులకు విధించిన బెయిల్ రద్దు చేయాలని పాట్నా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తప్పు చేసిన వ్యక్తి దర్జాగా తన ముందే తిరుగుతుండడంతో అతని బెయిలు రద్దు చేసేందుకు గత వారం రోజులుగా కోర్టు చుట్టూ చెప్పులరిగేలా తిరిగింది. ఈ కేసు ఎట్టకేలకు ఈ ఉదయం విచారణకు వచ్చింది. కాగా, అతని బెయిల్ రద్దు చేయడం కుదరదంటూ పాట్నా జిల్లా జడ్జి బీరేంద్ర కుమార్ ఆమె వేసిన పిటిషన్ కొట్టివేశారు.

దీంతో రీటా సింగ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన వద్ద ఉన్న సెల్ఫోన్ ను జడ్జిపైకి విసిరింది. అయితే సెల్ జడ్జి ముందు పడింది. దీంతో కోర్టు హాల్లో ఉన్నవారంతా షాక్ తిన్నారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు తేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో అమర్యాదగా ప్రవర్తించిన రీటా సింగ్పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ పై ఆమెను జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News