: పాకిస్థాన్ లో భూకంపం... ఒకరి మృతి, 30 మందికి గాయాలు
పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున భూమి కంపించడంతో ఒకరు మరణించగా, 30 మంది గాయపడ్డారని యూఎస్ జియోలాజికల్ సర్వే డిపార్ట్ మెంట్ వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది. భూకంపంతో జనం ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం నేపథ్యంలో స్థానిక పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. అక్కడ ఇవాళ జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.