: ట్రావెల్స్ బస్సులో మంటలు... ప్రయాణికులు సురక్షితం


విశాఖ జిల్లాలో కాళేశ్వరి ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. కశింకోట మండలం కాళ్ళపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే గమనించిన బస్సు సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దించివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వారు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News