: థర్డ్ ఫ్రంట్ లో చేరేందుకు కాంగ్రెస్ ఉబలాటపడుతోంది: ములాయం
తృతీయ కూటమిలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపుతోందని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో ఓ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ థర్డ్ ఫ్రంట్ లో చేరుతుందని అన్నారు. కాంగ్రెస్ తృతీయ కూటమికి బయటి నుంచి మద్దతు ఇవ్వాలనుకోవడం లేదని ఆయన చెప్పారు. మోడీ చెప్పేవన్నీ అబద్ధాలని రుజువు చేస్తుండడం వల్లే తనను చూసి ఆయన అసహనానికి గురవుతున్నారని ములాయం ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.