: రాజమండ్రిలో టీడీపీదే విజయం: మురళీమోహన్
రాజమండ్రి నియోజకవర్గంలోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మురళీమోహన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పోలింగ్ సరళి సైకిల్ గాలికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాదులో మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు శాసనసభ స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
టీడీపీ-బీజేపీ కూటమికి ప్రజలు ఓట్లు వేశారని రాజమండ్రి సిటీ బీజేపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు తమవేనని ఆయన అన్నారు. సీమాంధ్రలో చంద్రబాబు సీఎం కావడం ఖాయమని సత్యనారాయణ చెప్పారు.