: విద్యార్థులు బయటికి తీసిన బీఈడీ కుంభకోణం
బీఈడీ సీట్ల అనుమతులకు సంబంధించిన కుంభకోణాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బయటకు తీశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థలోని ఒక కాలేజిలో బీఈడీ సీట్ల అనుమతులకు యాజమాన్యాన్ని నర్సింహారావు అనే అధికారి మూడు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని విద్యార్థులు బట్టబయలు చేశారు. అధికారి డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చేందుకు ఒప్పుకున్న ప్రైవేటు కాలేజీ యజమాని నర్శింహారావుకి మూడు లక్షలు చెల్లించేందుకు రాగా ... ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, లంచగొండి అధికారిని పోలీసులకు అప్పగించారు.