: ఆ విమానం బయల్దేరింది... కానీ అందులో ఇంధనం అయిపోయింది!


పాకిస్థాన్లోని లాహోర్ నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 100 మంది ప్రయాణికులతో పాకిస్థానీ విమానం బయల్దేరింది. అయితే బయల్దేరిన కొద్దిసేపటికే విమానంలో ఇంధనం లేదన్న విషయాన్ని పైలెట్లు ఆలస్యంగా గ్రహించారు. అప్పటికే ఆ విమానం భారత్ భూభాగంపైకి ప్రవేశించి... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దాంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాకిస్థానీ పైలైట్లు లక్నోలోని ఏటీసీ అధికారులను సంప్రదించారు.

విమానంలో ఇంధనం చాలా తక్కువగా ఉందని, 100 మంది ప్రయాణికులున్నారని... విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావాల్సిన అవసరముందని పైలెట్లు చెప్పారు. దాంతో ఏటీసీ సిబ్బంది ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్.సి.హోతాకు సమాచారం అందించారు. హోతా అంగీకారం తెలపడంతో విమానం లక్నో ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఇంధనాన్ని నింపుకున్న అనంతరం తిరిగి ఢాకాకు బయల్దేరి వెళ్లింది.

  • Loading...

More Telugu News