: నూటికి నూరు శాతం టీడీపీ-బీజేపీ కూటమిదే విజయం: చంద్రబాబు


పోలింగ్ శాతం తగ్గించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ దాడులు చేశారని ఆయన అన్నారు. కల్తీమద్యం తయారుచేసి వైఎస్సార్సీపీ ఎంతో మంది ప్రాణాలను హరించిందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ చాలాచోట్ల దొంగనోట్లను పంచిందన్నారు. వైఎస్సార్సీపీ ఇంతగా తెగబడినా గవర్నర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

జగన్ దుర్మార్గాలను నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్ ఎండగట్టారని ఆయన చెప్పారు. పోలింగ్ శాతం ఎంత పెరిగితే తమకు అంత లాభమని బాబు అన్నారు. పోలింగ్ శాతం ఇంకా పెరుగుతుందని ఆశించామన్నారు. నూటికి నూరు శాతం టీడీపీ-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిన్ననే జెండా పీకేసిందని ఆయన అన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ ఈ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిందన్నారు.

  • Loading...

More Telugu News