: మధ్యాహ్నం 1.30 గంటల వరకు 58 శాతం పోలింగ్: భన్వర్ లాల్
సీమాంధ్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 1.30 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 60 శాతం పోలింగ్ నమోదైంది. సీమాంధ్రలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తనకు రిపోర్ట్ రాలేదని ఆయన చెప్పారు. రొంపిచర్లలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని, దీంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు భన్వర్ లాల్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు:
* శ్రీకాకుళం: 57 శాతం
* విజయనగరం: 54 శాతం
* విశాఖపట్నం: 56 శాతం
* పశ్చిమగోదావరి: 56 శాతం
* తూర్పుగోదావరి: 59 శాతం
* కృష్ణా: 58 శాతం
* గుంటూరు: 56 శాతం
* ప్రకాశం: 59 శాతం
* నెల్లూరు: 57 శాతం
* కడప: 59 శాతం
* కర్నూలు: 58 శాతం
* చిత్తూరు: 56 శాతం
* అనంతపురం: 60 శాతం.