: వార్న్ ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా: ఎలిజబెత్ హార్లీ


ఎంగేజ్ మెంట్ చేసుకున్న కొన్ని రోజులకే ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్, బ్రిటీష్ నటి ఎలిజబెత్ హార్లీ విడిపోయారు. అయితే, తానిప్పటికీ వార్న్ ను ప్రేమిస్తూనే ఉన్నానని 48 ఏళ్ల హార్లీ ఓ అంతర్జాతీయ పత్రిక ఇంటర్వ్యూలో తెలిపింది. కొంతకాలం పాటు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వారిద్దరూ గతేడాది బ్రేకప్ చెప్పాక ఆమె స్పందించడం ఇదే తొలిసారి. ఇద్దరూ విడిపోవడం చాలా బాధగానే ఉందని చెప్పింది. తర్వాత కొన్నాళ్లు కష్టపడ్డానని, ప్రస్తుతం మంచి పొజిషన్ లో ఉన్నానని వివరించింది. వాస్తవానికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇద్దరం బాగానే ఉన్నామని హార్లీ పేర్కొంది.

  • Loading...

More Telugu News