: పర్చూరులో నిలిచిన ఓటింగ్
ప్రకాశం జిల్లా పర్చూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ నిలిచిపోయింది. పర్చూరులోని 17వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏంజెట్ల మధ్య వివాదం నెలకొంది. అది తీవ్ర రూపం దాల్చడంతో పోలింగ్ అధికారులు ఓటింగ్ నిలిపేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.