: విశాఖ ఓటర్లే బద్దకిస్టులు: భన్వర్ లాల్
పట్టణాల్లో ఓటర్లు చర్చలకు, సలహాలకే పరిమితమని విశాఖ ఓటర్లు మరోసారి నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెలు, చిన్న పట్టణాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కాగా ఆంధ్రప్రదేశ్ లోని రెండో అతిపెద్ద పట్టణమైన విశాఖపట్టణంలో మాత్రం ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొనడం లేదని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. విశాఖలో కేవలం 28 శాతం పోలింగ్ మాత్రమే నమోదవుతోందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.