: సార్వత్రిక ఎన్నికల్లో ఇంకొక్క దశ.. ఆ తర్వాత ఫలితాలే!
సార్వత్రిక ఎన్నికల్లో ఇంకొక్క దశ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏడు దశల పోలింగ్ జరగ్గా... ఇవాళ ఎనిమిదో దశ పోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 12వ తేదీన తొమ్మిదో దశ ఎన్నికలు జరగనున్నాయి. అవి అయిపోతే, మరొక్క నాలుగు రోజుల్లో ఓట్ల లెక్కింపు. అదే రోజు ఫలితాల వెల్లడి ఉంటుంది.
మన రాష్ట్రంలో తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన ఎన్నికలు జరగ్గా, సీమాంధ్రలోని 25 ఎంపీలను ఎన్నుకునేందుకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరనేది మే 16వ తేదీన వెలువడే ఫలితాల్లో తేలిపోతుంది.