: 'ముల్లపెరియార్ డ్యామ్' వివాదంలో తమిళనాడుకు ఊరట
ఏళ్ల తరబడి చేస్తున్న న్యాయ పోరాటం తర్వాత 'ముల్లపెరియార్ డ్యామ్' వివాదంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ డ్యామ్ లో నీటిమట్టాన్ని 142 అడుగులు వరకు పెంచుకోవచ్చని ఆదేశించింది. అంతేకాక ఆనకట్ట భద్రతకు ఎటువంటి ముప్పు లేదని కోర్టు తెలిపింది. డ్యామ్ పునరుద్ధరణ పనిని పరిశీలించేందుకు, భద్రతా చర్యలు పరిశీలించేందుకు ముగ్గురు వ్యక్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం ప్రకటించింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న డ్యామ్ విషయంలో ఎప్పటి నుంచో వివాదం నెలకొంది. ఓ సమయంలో ముల్లపెరియార్ డ్యామ్ నీటిమట్టాన్ని 135 అడుగుల కంటే పెంచకూడదని కేరళ అసెంబ్లీ 2006లో డ్యామ్ సేఫ్టీ చట్టం చేసి ఆమోదించింది. ఈ చట్టాన్ని ఈ రోజు సుప్రీం రద్దు చేసింది.