: బ్లాక్ బోర్డుపై కమలం గుర్తు... రాహుల్ గాంధీ అభ్యంతరం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాను పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజవకర్గం పరిధిలో ఈ రోజు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలియతిరిగారు. ఈ సందర్భగా ఫుల్వా గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో బ్లాక్ బోర్డుపై కమలం గుర్తు వేసి ఉండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. స్కూళ్లలో రకరకాల కారణాలతో వేసిన గుర్తులను కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.