: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు
రాగల 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా అల్పపడీన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర అధికారి చెబుతున్నారు. తెలంగాణ, రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పారు.
ఇదిలా ఉంటే, ఈ అకాల వర్షాలు ఎక్కడ కురుస్తాయో.. పండిన పంటంతా ఎక్కడ నీటిపాలవుతుందో అని ఉభయగోదావరి జిల్లాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.