: నలుగురు మాజీ సీఎంలు రూ.29లక్షల విద్యుత్ వాడేశారు
'ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే మొహం' అన్న డైలాగ్ గుర్తుందా? ఇదిగో ఈ నేతలకు ఇదే వర్తిస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు నలుగురు ఐదేళ్లలో అప్పనంగా 29 లక్షల రూపాయల విద్యుత్ ను వాడేశారు. వీరిలో ముగ్గురు బీజేపీ వారు కాగా, ఒకరు కాంగ్రెస్ నేత. అత్యధికంగా బీసీ ఖండూరి రూ.15.5 లక్షలు(2010 నుంచి 2014 వరకు), ఆర్పీ నిశాంక్ రూ.8.5లక్షలు (2008-14), ఎన్డీ తివారీ రూ.2.5లక్షలు, భగత్ సింగ్ కోషియారి రూ.1.5లక్షలు మేర విద్యుత్ ను వినియోగించారు. సమాచార హక్కు కింద వచ్చిన దరఖాస్తుకు ప్రభుత్వమే ఈ సమాధానం ఇచ్చింది.